రివ్యూ: దొరసాని

రివ్యూ: దొరసాని

రన్ టైమ్: 2 గంటల 18 నిమిషాలు

నటీనటులు: ఆనంద్ దేవరకొండ,శివాత్మిక రాజశేఖర్,కన్నడ కిషోర్,వినయ్ వర్మ,శరణ్య తదిరులు

సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి

మ్యూజిక్: ప్రశాంత్ ఆర్.విహారి

ఎడిటింగ్ : నవీన్ నూలి

నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి,యశ్ రంగినేని

రచన,దర్శకత్వం: కె.వి.ఆర్ మహేంద్ర

రిలీజ్ డేట్: జులై 12,2019

కథ:

1980 ల్లో తెలంగాణ లోని పల్లెటూరి లో ఈ కథ జరుగుతుంది.ఆ ఊళ్లో ఉండే దొర (వినయ్ వర్మ) కనుసన్నల్లో పాలన నడుస్తుంది. వేరే ఊళ్లో చదుకునే రాజు (ఆనంద్ దేవరకొండ) సెలవుల్లో ఇంటికి వచ్చి దొర కూతురు దేవకి (శివాత్మిక) ని చూసి ఇష్టపడతాడు.ఎప్పుడూ గడీలోనే ఉండే దొరసానికి రాజు ప్రేమ నచ్చుతుంది.అందరూ భయపడే దొరను కాదని రాజు ఎలా ఎదిరించాడు.? చివరకు వీరిద్దరి ప్రేమ గెలిచిందా లేదా అనేది సినిమా?

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో ఆనంద్ దేవరకొండ తొలి సినిమా అయినప్పటికీ నటనలో ఫర్వాలేదనిపించాడు.శివాత్మిక కూడా బాగా చేసింది. వీళ్లిద్దరి తమ తొలి సినిమానే ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు అభినందించాల్సింది.దొరగా నటించిన వినయ్ వర్మ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు.నక్సలైట్ పాత్రలో కన్నడ కిషోర్ రాణించాడు.దాసి పాత్రలో శరణ్య,రాజు ఫ్రెండ్స్ గా నటించిన కొత్తవాళ్లు అందరూ ఆకట్టుకున్నారు.

టెక్నికల్ వర్క్:

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి సినిమా కు మెయిన్ హైలెట్ అయ్యాడు.పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి.తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నీవేశాలకు బలం చేకూర్చాడు.సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. 1980 ల్లోని తెలంగాణ పల్లెలను, గడీలను చూపించిన తీరు మెప్పిస్తుంది.ఆర్ట్ వర్క్,ప్రొడక్షన్ డిజైన్ అంతా బాగుంది.నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది..దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర రాసుకున్న సంభాషణలు హృద్యంగా ఉన్నాయి.

విశ్లేషణ:

‘‘దొరసాని’’ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరి. దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర ఓ నిజాయితీతో కూడిన కథను ప్రజెంట్ చేశాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటనను బేస్ చేసుకొని తీసుకున్న తీసిన ఈ సినిమాలో కమర్సియల్ అంశాలు తక్కువ. కానీ సినిమా చూస్తున్నంత సేపు రాజు,దేవకి ల ప్రేమలో లీనమవుతారు ఆడియన్స్. తెలంగాణ పల్లెల్లోని సంస్కృతి,యాస ను బాగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్..దానికి ఆయన్ని అభినందించాల్సిందే..ఇకపోతే సినిమా స్లోగా సాగుతుంది. కొన్ని ల్యాగులు తీసేయాల్సింది. రొటీన్ స్టోరీ కావడం,చివరకు ఏం జరుగుతుందో కూడా ఊహించగలిగేలా ఉంది. నటీనటుల పర్ఫార్మెన్స్,మ్యూజిక్,తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్,డైరెక్షన్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా ‘‘దొరసాని’’ ని ఓసారి చూడొచ్చు.