డంపింగ్ యార్డ్ కోసం స్థల పరిశీలన

డంపింగ్ యార్డ్ కోసం స్థల పరిశీలన

మరిపెడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కూణ్య తండా వద్ద ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డ్ ను తరలించేందుకు ప్రభుత్వ విప్, డోర్నకల్​ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ శనివారం స్థల పరిశీలన చేశారు.

గుండెపూడి పరిధిలోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని మరిపెడ తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామితో కలిసి చూశారు. ఎమ్మెల్యే సూచనతో త్వరలోనే డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని ఆఫీసర్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ శరత్, వీరన్న, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.