
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
మొత్తం 80,701 మంది ఫీజు చెల్లించగా, వారిలో 72,543 మంది మాత్రమే అప్లై చేశారు. కాగా, గురువారం సాయంత్రం వరకు 63. 613 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కాగా, ఈనెల 29న సీట్ల అలాట్మెంట్ చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6 వరకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా, గతేడాది దోస్త్ ఫస్ట్ ఫేజ్లో 1,04,784 మంది అప్లై చేసుకున్నారు.