దోస్త్ ఆన్‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పెంపు

దోస్త్ ఆన్‌‌‌‌లైన్  సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పెంపు
  • 13, 14 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు 

హైదరాబాద్, వెలుగు: దోస్త్ స్పెషల్ ఫేజ్‌‌లో సీట్లు పొందిన విద్యార్థుల కోసం ఆన్‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఈ నెల 12 వరకు పొడగించినట్లు అధికారులు ప్రకటించారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం తోనే రిపోర్టింగ్ గడువు ముగిసింది. అయినప్పటికీ, పండగలు, సెలవులు, వర్షాల నేపథ్యంలో గడువు పెంచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయడానికి కూడా గడువు ఈ నెల 12 వరకు పొడగించినట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల 13, 14 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.