దసరాకు నాని దోస్తానా సాంగ్ రిలీజ్

దసరాకు నాని దోస్తానా సాంగ్ రిలీజ్

ప్రతి పండక్కీ హీరోలు  తమ సినిమాకి సంబంధించిన  అప్‌‌డేట్స్‌‌తో ఫ్యాన్స్‌‌ని సంతోష పరుస్తుంటారు. నాని కూడా ఇదే పని చేయడానికి రెడీ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌‌లో ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నాడు నాని.  గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ సినిమా రూపొందుతోంది. దసరా కానుకగా మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్టు ఓ వీడియో గ్లింప్స్ ద్వారా నిన్న  ప్రకటించారు. ఇందులో నాని మందు కొడుతూ కనిపిస్తున్నాడు. ‘ధూమ్ ధామ్ దోస్తానా... మాసీయెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్’ సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ పాట విజయదశమికి వస్తోందని చెప్పాడు నాని. గతంలో ఫ్రెండ్‌‌షిప్‌‌ డే సందర్భంగా ఈ పాటకి సంబంధించిన పోస్టర్‌‌‌‌ను వదిలారు. ఇప్పుడు పాటను విడుదల చేస్తున్నారు.  

ఈ చిత్రం కోసం రగ్డ్‌‌ లుక్‌‌లోకి మారిపోయిన నాని..  తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్తున్నాడు.  కీర్తి సురేష్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ  చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.