
నల్గొండ జిల్లా : బీఆర్ఎస్ పార్టీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వేడిపుట్టిస్తున్నాయి. వేలాది మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోటీ పడుతుండటంతో ఏంచేయాలో ఎమ్మెల్యేలకు సైతం పాలుపోవడం లేదు. 2015లో నియోజకవర్గాలకు మంజూరైన ఇళ్లకు ఇన్నేళ్ల తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తుండటంతో పట్టణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు కేటాయిస్తే వేల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చి పడ్డాయి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్పగించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడటంతో ఎమ్మెల్యేలు సైతం ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగానే ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా బీఆర్ఎస్పార్టీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వేడిపుట్టిస్తున్నాయి. వేలాది మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోటీ పడుతుండటంతో ఏంచేయాలో ఎమ్మెల్యేలకు సైతం పాలుపోవడం లేదు. 2015లో నియోజకవర్గాలకు మంజూరైన ఇళ్లకు ఇన్నేళ్ల తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తుండటంతో పట్టణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు కేటాయిస్తే వేల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చి పడ్డాయి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్పగించింది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడటంతో ఎమ్మెల్యేలు సైతం ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగానే ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.
అవకతవకలు.. ఆందోళనలు..
లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని లబ్ధిదారులు ఆందోళనలకు దిగుతున్నారు. శనివారం మిర్యాలగూడలో 29వ వార్డుకు చెందిన పల్లపు భాగ్యలక్ష్మి ఆర్డీఓ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే ఆర్డీఓ ఆఫీసుల ఎదుట లబ్ధిదారులను వెంటపెట్టుకుని నిరసనలు చేపట్టారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీల్లో శుక్రవారం లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కలిపి 1656 ఇళ్లకు గాను 27,571 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 8,291 మందిని అర్హులుగా తేల్చారు. ఫైనల్ డ్రాలో 1,563 మందిని ఎంపిక చేశారు. దీనికంటే ముందు కొద్దిరోజుల కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని ఫీల్డ్ లెవల్లో ప్రత్యేక టీమ్‌లో విచారించారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేసి సర్వే చేయించారు. అయితే ఈ సర్వే సరిగా చేయలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేల అనుచరుల ఒత్తిళ్లు కూడా సర్వేపై ప్రభావం చూపాయని వార్డుల్లోని ప్రజలు అంటున్నారు. కాగా అర్హుల జాబితాను అన్ని వార్డుల్లో డిస్ప్లే చేశాక శుక్రవారం డ్రా తీశారు. అయితే డ్రా వద్దకు చేరుకున్న మహిళలు సొంత ఇళ్లు, పొలాలు, ట్రాక్టర్లు, కార్లు ఉన్నవాళ్లనే ఎంపిక చేసి డ్రా తీశారని గొడవకు దిగారు. మళ్లీ రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కానీ అధికారులు మాత్రం డ్రా తీసి ఫైనల్ లబ్ధిదారులను సెలక్ట్ చేశారు. వీళ్లలో ఎవరికైనా సొంత ఇళ్లు ఉన్నట్లు తేలినా, నిబంధనల ప్రకారం లేకున్నా డ్రా జాబితా నుంచి తొలగిస్తామని ఆఫిడవిట్ రాయించుకున్నారు. కానీ దరఖాస్తుదారులు ససేమిరా ఒప్పుకోకపోవడంతో శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి.
ప్రతిపక్ష పార్టీల మద్దతు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో భారీ అవకతవకలు జరిగాయని లబ్ధిదారుల పక్షాన శుక్ర, శనివారాల్లో ఆర్డీఓ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. సోమవారం జిల్లా కలెక్ట రేట్ఎదుట పేదలతో కలిసి ధర్నా చేస్తున్నట్లు బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్ ప్రకటించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్బత్తు ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ఎదుట లబ్ధిదారులు ఆందోళన చేశారు. రీసర్వే చేపట్టాలని లేదంటే నిరసన దీక్ష చేపడుతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు
లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డబుల్ బెడ్ రూమ్ఇళ్ల రూపంలో కొత్త తలనొప్పి ఎదురైందని తలలుపట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కౌన్సిలర్లు కూడా జోక్యం చేసుకునేకుందుకు భయపడుతున్నారు. దీన్నే అదనుగా భావించిన కాంగ్రెస్, బీజేపీ లీడర్లు లబ్ధిదారుల పక్షాన ఆందోళ నలు చేస్తుండటం బీఆర్ఎస్ లీడర్ల ను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.