డబుల్ ఇంజిన్ సర్కారు అంటే.. అప్పులను రెట్టింపు చేయడమే : జగ్గారెడ్డి

డబుల్ ఇంజిన్ సర్కారు అంటే.. అప్పులను రెట్టింపు చేయడమే : జగ్గారెడ్డి
  •      బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోంది

హైదరాబాద్, వెలుగు: బీజేపీ చెప్తున్న డబుల్ ఇంజిన్ సర్కారు అంటే.. ఉన్న అప్పులను రెట్టింపు చేయడమేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశం రుణం రూ.55 లక్షల కోట్లు ఉంటే..  ఒక్క నరేంద్ర మోదీ హయాంలోనే రూ.13 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. దేశానికి  అప్పులు చేసే ప్రధాని వద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను 15 ఎంపీ సీట్లలో ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు. 

సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని.. రాముడి పేరు చెప్పి పబ్లిక్‌‌‌‌‌‌‌‌ని పరేషాన్ చేస్తోందని జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. 2014లో తులం బంగారం రూ.28 వేలు ఉండేదని, మోదీ హయాంలో రూ.75 వేలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరల నియంత్రణ ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే బంగారం ధరలు తగ్గిస్తామన్నారు.