
దిల్ సుఖ్ నగర్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు. నిర్మాణంలోని ఇండ్ల వద్ద గురువారం నిరసన తెలిపిన ఘటన మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్లో చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇండ్లు నిర్మించి ఇస్తామంటే తమ గుడిసెలు తొలగించుకున్నామని, ఏడేళ్లవుతున్నా నిర్మాణాలు పూర్వవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి, లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.