ఫిట్స్ ​వ్యాధిపై  అవగాహన అవసరం

ఫిట్స్ ​వ్యాధిపై  అవగాహన అవసరం

ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్

హైదరాబాద్, వెలుగు: ఫిట్స్ వ్యాధిపై అవగాహన అవసరమని ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు. వరల్డ్ ఎపిలెప్సీ డే సందర్భంగా గురువారం ఉస్మానియా హాస్పిటల్​లో  ఫిట్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ కొందరు అవగాహన లేకుండా.. ఫిట్స్ బాధితులను భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లి ప్రాణాల మీదకి తెస్తున్నారన్నారు. ఫిట్స్​ను వ్యాధిగా గుర్తించాలన్నారు. ఫిట్స్ వచ్చిన వ్యక్తి చేతిలో తాళం పెట్టడం, నోరు మూయడం చేయొద్దన్నారు. పేషెంట్​ను ఎడమవైపు పడుకోబెట్టాలని.. నాలుక బయటకు వచ్చేలా చూడాలన్నారు. ఫిట్స్ వచ్చిన వ్యక్తి చుట్టూ జనాలు గుమిగూడకుండా పేషెంట్​కు ఆక్సిజన్ అందేలా చూడాలన్నారు. వెంటనే అంబులెన్స్​కు కాల్ చేసి దగ్గరలోని హాస్పిటల్​కు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. త్రివేణి, ఆర్‌‌ఎంవోలు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, స్టూడెంట్లు, న్యూరాలజీ విభాగం డాక్టర్లు పాల్గొన్నారు.