ఎంజీఎం సూపరిండెంట్‎గా డాక్టర్ స్వర్ణ కుమారి

ఎంజీఎం సూపరిండెంట్‎గా డాక్టర్ స్వర్ణ కుమారి

వరంగల్: వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు సర్కార్ అధికారులను నియమించింది. ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెంట్‎గా డాక్టర్ జి స్వర్ణ కుమారి, కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‎గా డాక్టర్ వి మురళీకృష్ణ, వరంగల్ ప్రాంతీయ ఐ హాస్పిటల్ సూపరిండెంట్‎గా డాక్టర్ రాజా భరత్ కుమార్, ప్రభుత్వ టీబీ మరియు చెస్ట్ హాస్పిటల్ సూపరిండెంట్‎గా డాక్టర్ సంజీవ్ కుమారి, సీకేఎం ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ సూపరిండెంట్‎గా డాక్టర్ జి షర్మిల, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ సూపరిండెంట్‎గా డాక్టర్ జె రాజేశ్వరిలను అపాయింట్ చేసింది. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అధికారులను బదిలీ చేయడం వైద్యారోగ్య శాఖలో హాట్ టాపిక్‎గా మారింది.