న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ మంగళవారం యునైటెడ్ కింగ్‌డమ్‌లో క్యాన్సర్ మందు వెర్సావోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వెర్సావో అనేది రోష్ నమోదిత ట్రేడ్‌మార్క్ అయిన అవాస్టిన్ బయోసిమిలర్. మెటాస్టాటిక్ కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గ్లియోబ్లాస్టోమా, మెటాస్టాటిక్ మూత్రపిండ కణ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ మెటాస్టాటిక్ బ్రెస్ట్ వంటి అనేక రకాల క్యాన్సర్‌ల చికిత్స కోసం దీనిని సూచిస్తారని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
100 ఎంజీ, 400 ఎంజీ డోసుల్లో సింగిల్ యూజ్డ్ సీసాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ 2019లో భారతదేశంలో వెర్సావోను ప్రారంభించింది. తదనంతరం, అదే బ్రాండ్ పేరుతో థాయ్‌లాండ్, ఉక్రెయిన్, నేపాల్, జమైకా వంటి ఇతర మార్కెట్లలోకి ఇది వెళ్లింది. కొలంబియాలో పెర్సివియా బ్రాండ్ పేరుతో వెర్సోవాను అమ్ముతున్నారు.
