డాక్టర్ రెడ్డీస్ చేతికి హాలియన్ ​ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ బిజినెస్​

డాక్టర్ రెడ్డీస్ చేతికి హాలియన్ ​ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ బిజినెస్​

హైదరాబాద్​, వెలుగు: బ్రిటిష్ కన్స్యూమర్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ కంపెనీ హాలియన్​ పీఎల్​సీ అమెరికా వెలుపల తన నికోటిన్ రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ థెరపీ (ఎన్​ఆర్​టీ) వ్యాపారాన్ని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు 500 మిలియన్​ డాలర్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోలో నికోటినెల్, నికాబేట్, హ్యాబిట్రోల్,  థ్రైవ్ వంటి బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. ఇవి 30కి పైగా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో లభిస్తాయి. 

ఎన్ఆర్​టీ కేటగిరీలో యునైటెడ్ స్టేట్స్ మినహా ప్రపంచవ్యాప్తంగా నికోటినెల్ రెండవ అతిపెద్ద బ్రాండ్ అని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. 2024 క్యాలెండర్ సంవత్సరం నాలుగో క్వార్టర్​ ప్రారంభంలో లావాదేవీ ముగుస్తుందని భావిస్తున్నారు. ఒప్పందం ముగిసిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న అన్ని దేశాలలో డాక్టర్ రెడ్డీస్ ఎన్​ఆర్​టీ వ్యాపారం  డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతికి వస్తుంది.