
హైదరాబాద్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందని ఆరోపించారు. ‘దీనిపై 2022 నవంబర్లోనే నేను స్పందించా. రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ గత ప్రభుత్వం నా ప్రకటనలను తోసిపుచ్చింది. గతంలో నేను చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది' అని తమిళిసై ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.