బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి కాంగ్రెస్​ లో చేరికలు: ఆహ్వానించిన వివేక్​ వెంకటస్వామి, నల్లాల ఓదెలు

  బీఆర్​ఎస్​, బీజేపీ నుంచి కాంగ్రెస్​ లో చేరికలు: ఆహ్వానించిన వివేక్​ వెంకటస్వామి, నల్లాల ఓదెలు

కోల్​బెల్ట్​,వెలుగు: కాంగ్రెస్ లో చేరిన తరువాత తొలిసారిగా మందమర్రికి  వచ్చిన పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామికి ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు,  ప్రజాప్రతినిధులు, పార్టీల కతీతంగా అనుచరులు, స్థానికులు, అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. శనివారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్​ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి నివాసంలో నిర్వహించిన  పార్టీ సమావేశంలో  వివేక్​ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి  మండలాలు, గ్రామాలు, పట్టణాలకు చెందిన బీఆర్ఎస్​, బీజేపీ లీడర్లు, కార్యకర్తలు, ఆటో యూనియన్​, పలు కులసంఘాల బాధ్యులు  కాంగ్రెస్ లో చేరారు. వీరికి వివేక్​ వెంకటస్వామి,  నల్లాల ఓదెలు, భాగ్యలక్ష్మి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ క్యాతనపల్లి టౌన్ ప్రెసిడెంట్​అబ్దుల్​అజీజ్, నియోజకవర్గంలోని బీజేపీ  కాంగ్రెస్​ శ్రేణులు​ వివేక్​ వెంకటస్వామికి  మద్దతు  పలికారు. మందమర్రికి చెందిన మాజీ ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య,  చిర్రకుంట సర్పంచి ఓడ్నాల కొమురయ్య, మాజీ సర్పంచులు గోదారి రాజేశ్​, కిషన్​రావు, మాజీ ఎంపీటీసీలు రాంటెంకి విజయ్య

దుర్గం కుమార్, వార్డు మెంబర్లు ఓడ్నాల రజిత, బూనేని మంజుల, రాంటెంకి తిరుపతి, దుర్గం సమేందర్, టేకుమట్లకు చెందిన గోనే రాజేశం, సూర్యతేజ, లక్ష్మిమల్లు, కిష్టయ్య, మందమర్రికి చెందిన  స్టేట్​ లీడర్​ గుడ్ల రమేశ్, అర్జున్ మహంత్, కాసర్ల శ్రీనివాస్, జలీల్, మంద తిరుమల్​రెడ్డి, గజె రవి, మహాదేవుని రమేశ్​, మందమర్రి టౌన్​ బీజేపీ జనరల్​ సెక్రటరీ గడ్డం శ్రీనివాస్​, బీజేవైఎం ప్రెసిడెంట్​ ఓరుగంటి సురేందర్​, మేకల తిరుపతి, గద్దె రాములు, నియోజకవర్గంలోని  ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,   తదితరులు వెయ్యి మందికి పైగా  కాంగ్రెస్ లో చేరారు.  
 
భీమారం మండలం నుంచి

 మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో  భీమారం మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు శనివారం సాయంత్రం కాంగ్రెస్ లో  చేరారు. పార్టీలో చేరిన వారిలో భీమారం జడ్పీటీసీ భూక్య తిరుమల లక్ష్మణ్, కాజీపల్లి ఎంపీటీసీ పెద్దల రూప బాపు, సర్పంచ్ దాడి తిరుపతి, ధర్మారం సర్పంచ్ చడంక లక్ష్మీ తిరుపతి, ఆరేపల్లి సర్పంచ్ అనపర్తి సునీత రమేశ్, మద్దికల్ విలేజ్  బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చిలకాని కనకయ్య

మండల ప్రధాన కార్యదర్శి కొత్త సత్తిరెడ్డి,  భీమారం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్, సీనియర్ లీడర్ కోడేటి రవి తదితరులు పాల్గొన్నారు.  అలాగే జైపూర్ మండలం కిష్టాపూర్ సర్పంచ్ పద్మజ బాపురెడ్డి, గంగిపల్లి సర్పంచ్ లింగారెడ్డి, రామారావుపేట సర్పంచ్ నామాల తిరుపతి, దుబ్బపల్లి సర్పంచ్ ఉండ్రాళ్ల ఎల్లయ్య , కోటపల్లి మండలం నక్కలపల్లి సర్పంచ్ తోట అశోక్, ఉపసర్పంచ్ శ్రీనివాస్,  వార్డు మెంబర్లు మల్లారెడ్డి, మహేశ్, సతీష్, సంపత్ , పోషం, కే.మహేశ్​ కాంగ్రెస్ లో చేరారు.

వివేక్ వెంకటస్వామితోనే ఉంటా

చెన్నూరు,వెలుగు: తాను మాజీ ఎంపీ, కాంగ్రెస్​ నేత  వివేక్ వెంకటస్వామితోనే ఉంటానని మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయక్  స్పష్టం చేశారు. శనివారం బీజేపీకి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామ పత్రాన్ని  పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కు  పంపించారు.