DRDO లో జేఆర్ ఫెలో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదలైంది.. అప్లయ్ చేసుకోండిలా

DRDO లో జేఆర్ ఫెలో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదలైంది.. అప్లయ్ చేసుకోండిలా

డీఆర్​డీఓ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఏఎస్) రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
మొత్తం ఖాళీలు: 15 (ఆర్ఏ 4, జేఆర్ఎఫ్ 11). 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎం.ఫార్మా/ ఎంఎస్ (ఫార్మా)/ ఎం.టెక్ (ఫార్మా), బీడీఎస్, పీహెచ్ డీ పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 1. 
లాస్ట్ డేట్: జూన్ 30. 
ఇంటర్వ్యూ తేదీలు: జులై 15, 17, 20, 22, 23, 24.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్drdo.gov.inను సందర్శించండి.