డ్రీమ్ క్యాచర్స్‌‌ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌‌‌‌ విడుదల

డ్రీమ్ క్యాచర్స్‌‌ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌‌‌‌ విడుదల

ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రాంరెడ్డి , ఐశ్వర్య హోలక్కల్ ముఖ్య పాత్రల్లో సందీప్ కాకుల దర్శకనిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘డ్రీమ్ క్యాచర్స్‌‌’.  తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. దర్శకనిర్మాత సందీప్ కాకుల మాట్లాడుతూ  ‘డ్రీమ్ బేస్డ్​ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఈ ఏడాది వచ్చే చిన్న చిత్రాల్లో మంచి చిత్రంగా నిలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీకరించిన తీరు ఔరా అనిపించే విధంగా ఉంటుంది’ అని చెప్పాడు. ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, సంగీత దర్శకుడు రోహన్ శెట్టి, డీవోపీ ప్రణీత్ గౌతమ్ నంద పాల్గొన్నారు.