ముంబై: బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. రూ.15 కోట్లు విలువచేసే బంగారాన్ని సీజ్ చేశారు. భారత్లోకి బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చి గ్రే మార్కెట్లో అమ్మడానికి ప్లాన్ చేశారని అధికారులు తేల్చారు.
ముంబైలో గోల్డ్ స్మగ్లింగ్, మెల్టింగ్ సిండికేట్ నడుపుతున్నారనే సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు సోమవారం సిటీలోని 4 చోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించారు. రెండు అక్రమ మెల్టింగ్ యూనిట్లు, రెండు ఆన్ రిజిస్టర్డ్ షాపులను గుర్తించారు. రూ.15.05 కోట్ల విలువచేసే 11.88కేజీల గోల్డ్ ను, రూ. 13.17 లక్షల విలువైన 8.72కిలోల వెండిని సీజ్ చేశారు.
