నర్సింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ బాగోతం: ఇనిస్టిట్యూట్లోనే మందుకొట్టాడు.. మసాజ్ చేయించుకున్నాడు

నర్సింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ బాగోతం: ఇనిస్టిట్యూట్లోనే మందుకొట్టాడు.. మసాజ్ చేయించుకున్నాడు

ఆయనో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్.. ఎంతో బాధ్యత గల పోస్ట్.. విద్యార్థులను విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్ చక్కదిద్దాల్సిన ఉద్యోగం.. కానీ ఆయన చేసే పనులన్నీ సమాజానికి కీడు, చెడు చేసేపనులే.. కాలేజీ లో ఆయను చేసే ఆగడాలకు అడ్డూ అదుపులేదు.. కాలేజీలో మందు కొడతాడు.. మసాజ్ చేయించు కుంటాడు..ఇలా ఆయనగారి లీలలు చూడలేక విద్యార్థులు పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా స్పందన లేదు.. దీంతో చేసేదేమీ లేక ప్రిన్సిపాల్ గారీ ఆగడాలు శృతిమించి పోతున్నాయి చర్యలు తీసుకోండని ముఖ్యమంత్రికే లెటర్ రాశారు. 

ALSO READ | అక్కడ కూడానా : శవాలను పక్కన పెట్టుకుని.. ఆ పక్కనే రాస లీలలు ఏంట్రా

బీహార్ లోని బెట్టియాప్రభుత్వ  GNM శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్  మనీష్ జైస్వాల్ పై  విద్యార్థులు సీఎం, ఆరోగ్య మంత్రికి ఫిర్యాదు చేశారు. ‘‘జైస్వాల్ కాలేజీలోని మద్యం తాగడం, మసాజ్ చేయించుకోవడం వంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ చేస్తున్నాడని విసిగిపోయి మీకు లెటర్ రాస్తున్నామంటూ’’ సీఎంకు రాసిన లేఖలో వివరిం చారు. ప్రిన్సిపాల్ జైస్వాల్ లీలలకు సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రికి షేర్ చేశారు. ఇక ముఖ్యమంత్రి చర్యలకు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జైస్వాల్ తీరును చూసిన వారంతా కాలేజీలో ఇలాంటి పనులేంటని విసుక్కుంటున్నారు.