కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాగునీటి గండం 

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాగునీటి గండం 
  •     గోదావరిలో అడుగంటుతున్న జలాలు 
  •     సింగరేణి కాలనీలకు రోజు విడిచి రోజు వాటర్​సప్లై
  •     ఇంటెక్​వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోటర్లను కిందికి దించుతున్న అధికారులు 

గోదావరిఖని, వెలుగు : సింగరేణి కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాగునీటి గండం పొంచి ఉంది. వేసవిలో ఎండలు ముదరడంతో గోదావరిలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో గోదావరిఖని ఏరియా పరిధిలోని కాలనీలకు రోజు విడిచి రోజు తాగునీటిని సప్లై చేయాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లోనూ నీటికి ఇబ్బంది ఏర్పడనున్న దృష్ట్యా సాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఉండే నీటిని కూడా లాగేందుకు గోదావరి ఒడ్డున ఉన్న ఇంటెక్​వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మోటర్లను మరింత కిందికి దించుతున్నారు. 

తగ్గిపోతున్న నీటి నిల్వలు

ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో గోదావరిలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. నదిలో పైనుంచి వచ్చే జలాలు లేకపోవడం కూడా తాగునీటి కష్టాలకు కారణమవుతున్నాయి. సింగరేణి రామగుండం రీజియన్​ పరిధిలో ప్రతిరోజు గోదావరిఖని ఏరియాలోని క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నివాస ప్రాంతాలకు 20 ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ(మిలియన్​ లీటర్స్​ ఫర్​ డే), యైటింక్లయిన్​ కాలనీ, సెంటినరీకాలనీలోని క్వార్టర్లకు 15 ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీల వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గోదావరి నది నుంచే సప్లై చేస్తారు.

అయితే నదిలో నీటి నిల్వలు తగ్గు ముఖం పట్టి, ఇంటెక్​వెల్​లోని మోటర్లకు నీరు అందకపోవడంతో వాటిని 1.5 మీటర్ల కిందికి దించేలా చర్యలు తీసుకుంటున్నారు. నదిలో ఇన్​ఫిల్ట్రేషన్​ గ్యాలరీల(బావులు)లో నీటి నిల్వలు లేకుండా పోతే సాండ్​ బెడ్​లలో ఉండే నీటినైనా తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రత్యామ్నాయాలపై దృష్టి

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రోజువిడిచి రోజు సప్లై చేస్తుండగా.. మేలో నీటి కష్టాలు మరింత పెరుగనున్నాయి. ఈక్రమంలో గోదావరిలో నీటి లభ్యతపై సింగరేణి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. భూగర్భ బొగ్గు గనుల్లో ఊటగా వచ్చే నీటిని మోటర్ల ద్వారా పైకి పంపించి అక్కడి నుంచి ఫిల్టర్​బెడ్​లకు తరలించి శుద్ధి చేసి వాడుకోవాలనే ఆలోచన చేస్తోంది. రామగుండం కార్పొరేషన్​కు భగీరథ కింద రోజుకు 20 ఎంఎల్​డీ వాటర్​ మూర్మూర్​ పంప్​ హౌస్​ నుంచి సప్లై అవుతోంది. కార్పొరేషన్​ ఏరియాకు కూడా వాటర్​ సప్లైలో ఇబ్బంది ఏర్పడితే సింగరేణి గనుల నుంచి వచ్చే వాటర్​ను వాడుకునేలా ప్లాన్​ చేస్తున్నారు. 

తాగునీటి సప్లై పెంచేందుకు సింగరేణి చర్యలు 

గోదావరిలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండడంతో రాబోయే రోజుల్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. కార్మిక కుటుంబాలకు తాగునీరు, ఇతర అవసరాల కోసం నీటిని సప్లై చేసేందుకు మేనేజ్​మెంట్​ చర్యలు తీసుకుంటోంది. అయితే నీటి కొరత దృష్ట్యా ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి.

 - చింతల శ్రీనివాస్​, జనరల్​ మేనేజర్​