దేవుడా : హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో నల్లా నీళ్లు బంద్

దేవుడా : హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో నల్లా నీళ్లు బంద్

హైదరాబాదీలకు బిగ్ అలెర్ట్.. నీటి సరఫరాకు సంబంధించి నగర వాసులకు జలమండలి కీలక సూచనలు చేసింది. రేపటి నుంచి(జనవరి 3) హైదరాబాద్ పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ - 1 లోని సంతోష్ నగర్ వద్దనున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా నల్గొండ - ఓవైసీ డౌన్ ర్యాంప్ అలైన్ మెంట్ లో ఉన్న సంతోష్ నగర్ దగ్గర కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు. కాబట్టి జనవరి 3 నుంచి నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జల మండలి అధికారులు ప్రకటించారు.

ఫ్లై ఓవర్ పనులు జనవరి 03, 2024 బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే.. జనవరి 04 గురువారం ఉదయం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. కాబట్టి ఈ 24 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. 

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

1. ఓ అండ్ ఎం డివిజన్ - 1 : మిరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ.
2. ఓ అండ్ ఎం డివిజన్ – 2(A): సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, ఆస్మన్ గఢ్, యాకుత్ పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్.
3. ఓ అండ్ ఎం డివిజన్ – 2(B) : రియాసత్ నగర్, ఆలియాబాద్.
4. ఓ అండ్ ఎం డివిజన్ - 4 : బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్.
5. ఓ అండ్ ఎం డివిజన్ - 5 : నారాయణ గూడ, అడిక్ మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలుకల గూడ.
6. ఓ అండ్ ఎం డివిజన్ – 10 (A) : దిల్ సుఖ్ నగర్ ప్రాంతం.
7. ఓ అండ్ ఎం డివిజన్ - 20 : బొంగులూరు.
8. ఓ అండ్ ఎం డివిజన్ - 22 : మన్నెగూడ ప్రాంతాలు ఉన్నాయి. 

కాబట్టి పైన పేర్కొన్న ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి అధికారులు కోరారు. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత.. యాథావిధిగా తాగునీటి సరఫరా జరగుతుందని సూచించారు. ఈ విషయంలో నగరవాసులు తమకు సహకరించాలని జలమండలి అధికారులు కోరారు.