
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ డ్రివెన్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో శుక్రవారం తన మొదటి ఆఫీసు ప్రారంభించింది. ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్‌లో యూఏఈ భాగస్వామిగా ఉన్న ఈ సంస్థ, భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఐటీ రంగం వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, లగ్జరీ ఇళ్ల విభాగంలో హైదరాబాద్ రాణిస్తున్నందున డ్రివెన్ ఈ నిర్ణయం తీసుకుంది.
డ్రివెన్ ప్రాపర్టీస్ ఫౌండర్, సీఈఓ అబ్దుల్లా అలజాజీ హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడిదారులకు నగరం అనుకూలమని అన్నారు. తమ సంస్థ, ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్‌తో భాగస్వామ్యం ద్వారా, హైదరాబాద్‌లోని ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 మిలియన్ల మందికి పరిచయం చేస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మి రామ్ రెడ్డి పాల్గొన్నారు.