ఛేజింగ్.. ఛేజింగ్.. రివర్స్ డ్రైవింగ్తో పోలీసుల నుంచి తప్పించుకున్న కారు డ్రైవర్

ఛేజింగ్.. ఛేజింగ్.. రివర్స్ డ్రైవింగ్తో పోలీసుల నుంచి తప్పించుకున్న  కారు డ్రైవర్

చేజింగ్.. చేజింగ్.. హైవే పై చేజింగ్.. రివర్స్ డ్రైవింగ్ ఛేజింగ్.. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోని హైవేపై పోలీసులు కారును వెంబడిస్తున్న షాకింగ్ వీడియా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఘజియాబాద్ పోలీసులు హైవేపై కారును వెంబడించడం, కారు డ్రైవర్ తన కారును రివర్స్ డైరెక్షన్ లో నడుపుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం బాలీవుడ్  సినిమా సన్నివేశాలను ఈ వీడియోలో చూడొచ్చు. 

42 సెకనుల ఈ వీడియోల ఘజియాబాద్ లోని హైవే పై వైట్ కలర్ హ్యుందాయ్ ఐ20 కారును పోలీసులు వెంబడించడం, కారు డ్రైవర్ రివర్స్ డైరెక్షన్ లో కారు నడుతున్నట్లు కనిపిస్తుంది. కారు పోలీసులనుంచి తప్పించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తు్నట్లు కనిపిస్తుంది. గజియాబాద్ పోలీసులు కారు డ్రైవర్ ను పట్టుకోలేకపోయారని నాటకీయంగా కారు ఛేజింగ్ లో డ్రైవర పోలీసుల నుంచి తప్పించుకున్నాడని ఈ వీడియోలో పేర్కొన్నారు. రోడ్డు అవతలి వైపు డ్రైవింగ్ చేస్తున్న మరో కారు డ్రైవర్ ఈ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశడు. 

అయితే ఈ వీడియోకు బాగానే లైకులు, కామెంట్లు వచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇది నిజంగా బాలీవుడ్ సినిమాలో ఓ సీన్ లా అనిపించింది అని రాశారు. మరో నెటిజన్ స్పందిస్తూ ఇది సినిమాలోని సన్నివేశం కాదు.. ఇది ఇన్ స్టా గ్రామ్  రీల్ అయి ఉండొచ్చని చెప్పారు . అయితే ఈ వీడియోపై గజియాబాద్ పోలీసులనుంచి ఎలాంటి స్పందన లేదు. అదృష్టవశాత్తు పోలీసుల ఛేజింగ్ లో ఎవరికీ గాయాలు కాలేదు. ఎటువంటి ప్రమాం కూడా జరగలేదు.