డాక్టర్‌‌‌‌ రెడ్డీస్‌‌, జైడస్ మందుల రీకాల్‌‌

డాక్టర్‌‌‌‌ రెడ్డీస్‌‌, జైడస్ మందుల రీకాల్‌‌

న్యూఢిల్లీ: అమెరికాలో తయారీ సమస్యల కారణంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్,  జైడస్ లైఫ్‌‌సైన్సెస్ తమ మందులను రీకాల్ చేసుకున్నాయని యూఎస్ ఎఫ్‌‌డీఏ ప్రకటించింది. హైదరాబాద్‌‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ అమెరికన్ బ్రాంచ్‌‌  571 వైల్స్ సక్సినైల్‌‌క్లోరైడ్‌‌  ఇంజెక్షన్‌‌ను రీకాల్ చేసుకుంది. కండరాల రిలాక్సేషన్‌‌కు దీనిని  వాడతారు. ఆరు నెలల స్టెబిలిటీ టెస్టింగ్‌‌లో స్పెసిఫికేషన్స్‌‌కు తగ్గట్టు మెడిసిన్‌‌ లేకపోవడంతో మందులను రీకాల్ చేసుకుంటోంది. కిందటి నెల 26న క్లాస్‌‌2 రీకాల్‌‌ను డాక్టర్ రెడ్డీస్ ప్రారంభించింది.  

అలాగే, జైడస్ ఫార్మాస్యూటికల్స్ (యూఎస్‌‌) సెప్టెంబర్ 24న ఎంటెకావిర్‌‌‌‌ ట్యాబ్లెట్ల (0.5 ఎంజీ)కు చెందిన 912 బాటిల్స్‌‌ను, 1 ఎంజీ డోస్‌‌ గల 600 బాటిల్స్‌‌ను రీకాల్ చేసుకుంటోంది. ఈ మందును హెపటైటిస్ బీ చికిత్సలో వాడతారు. ఈ డ్రగ్‌‌లో  మలినాలు ఉండడంతో కంపెనీ రీకాల్ చేపట్టింది.  

ఈ కంపెనీ కూడా క్లాస్‌‌ 2 రీకాల్ చేపడుతోంది. యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ  ప్రకారం, క్లాస్‌‌2 రీకాల్ అంటే, ఆ ఉత్పత్తి వాడటం వల్ల తాత్కాలిక లేదా మందులతో తగ్గే ఆరోగ్య సమస్యలు కలగవచ్చు.  కానీ తీవ్రమైన ప్రభావాలు కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. భారత్‌‌లో యూఎస్‌‌ ఎఫ్‌‌డీఏ అనుమతితో పనిచేస్తున్న ఫార్మా ప్లాంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.