కూకట్పల్లిలో అనుమతుల్లేని బ్లడ్ బ్యాంకు..రక్తం, ప్లాస్మా అక్రమదందా..వ్యక్తి అరెస్ట్

కూకట్పల్లిలో అనుమతుల్లేని బ్లడ్ బ్యాంకు..రక్తం, ప్లాస్మా అక్రమదందా..వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: కూకట్ పల్లి పరిధిలోని మూసాపేటలో బ్లడ్ బ్యాంకుపై డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతుల్లేని బ్లడ్ బ్యాంకులో రక్తం సేకరణ, ప్లాస్మా, సీరం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు మూసాపేట భవానీ నగర్ లోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకుపై దాడులు చేశారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవేంద్ర  నాయక్ అనే వ్యక్తి  భవానీనగర్ లో ఓ ఇంటిని అద్దె కు తీసుకొని అక్రమంగా బ్లడ్ బ్యాంకును నిర్వహిస్తున్నారు. పలు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం సేకరించి వాటినుంచి ప్లాస్మా, సీరం వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రక్తం, ప్లాస్మా, సీరం లను స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర నాయక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.