
ఓ డ్రగ్ డీలర్ కొకైన్ తీసుకొని వెళ్తున్నాడు. సడన్‌గా పోలీసులు అతడి కారును ఆపారు. అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ డ్రగ్ డీలర్‌ను కోర్టులో హాజరుపరిచారు. కానీ అతనికి శిక్ష వేయించ్చింది మాత్రం అతని కారే. ఎలా పట్టించిందంటే.. సౌత్‌వేల్స్‌కు చెందిన స్కాట్ కుర్టిస్ గతేడాది సెప్టెంబర్‌లో డ్రగ్స్‌తో కారులో వెళ్తున్నాడు. ఇంతలోనే పోలీసులు వచ్చి అతడి కారును ఆపారు. వెంటనే అతడు కొకైన్ ఉన్న తన బ్యాగును పడేయాలని చూశాడు. కానీ అప్పటికే అతడిని అరెస్టు చేశారు. స్కాట్ ఇంట్లో సెర్చ్ చేస్తే గంజాయి మొక్కలు చాలా వరకు బయటపడ్డాయి. ఈ ఏడాది జులై 19వ తేదీన అతడిని కోర్టులో హాజరుపరిచారు.
డ్రగ్స్‌ను తన పర్సనల్ యూజ్ కోసమే వాడుతున్నానని అతను కోర్టుకు చెప్పాడు. తర్వాత పోలీసులు ఓ వీడియోను కోర్టులో ప్లే చేశారు. అందులో స్కాట్ ‘డ్రగ్స్ ఎంతకు కావాలి’ అని మరో వ్యక్తిని అడుగుతున్నాడు. వీడియో చూశాక స్కాట్ నోట్లోంచి మాట రాలేదు. ‘బుక్కయిపోయాను పో’ అనుకున్నాడు. కోర్టు అతడికి రెండేళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. స్కాట్‌ను అతని కారే పట్టించిందని, కారులోని డాష్‌బోర్డ్ క్యామ్‌లో అతను చేసిన డ్రగ్ డీలింగ్స్ రికార్డయ్యాయని పోలీసులు చెప్పారు.