డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్..కారు గుద్దితే కాలు తెగింది..సూర్యాపేట జిల్లాలో ఘటన

డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్..కారు గుద్దితే కాలు తెగింది..సూర్యాపేట జిల్లాలో ఘటన
  •     యువకుడి పరిస్థితి విషమం

సూర్యాపేట, వెలుగు: మద్యం మత్తులో రాంగ్‌‌‌‌‌‌‌‌రూట్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన కారు ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయాడు. అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎస్‌‌‌‌‌‌‌‌కే అక్బర్ పాషా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి తిమ్మాపురం నుంచి సూర్యాపేటకు బైక్​పై వస్తున్నాడు. 

గాంధీనగర్​ వద్దకు రాగానే సూర్యాపేటకు చెందిన అంతటి జయరాం తన స్నేహితులతో కలిసి కారులో రాంగ్‌‌‌‌‌‌‌‌రూట్‌‌‌‌‌‌‌‌లో వచ్చి అతడిని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అక్బర్ పాషా కుడి కాలు తెగిపోగా, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. 

పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కారులో బడా పారిశ్రామికవేత్తల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారు నడిపింది జయరాం కాకుండా మరో వ్యక్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.