ఫుల్ గా మందు కొట్టి.. నడి ఆకాశంలో ఫ్లైట్ డోర్ తీసి..

ఫుల్ గా మందు కొట్టి.. నడి ఆకాశంలో ఫ్లైట్ డోర్ తీసి..
  • ఏడుగురు పట్టుకున్నా ఆగలే.. సెల్లో టేప్ తో కట్టేసినా ఫలితం నిల్
  • ఇక తిప్పలు పడలేక విమానం ల్యాండ్ చేసి.. దింపేసి.. టేకాఫ్..

మాస్కో: పీకలదాకా మందు కొట్టి.. ఫ్లైట్ లో హల్ చల్ చేశాడు. ప్రయాణికులందర్నీ పరేషాన్ చేశాడు. నడి ఆకాశంలో విమానం ఎమర్జెన్సీ డోర్ చేసే ప్రయత్నం చేసి.. చుక్కలు చూపించాడో తాగుబోతు. ఎంత మంది ప్రయాణికులు ఆపడానికి ట్రై చేసినా వారి వల్ల కాలేదు. ఏడుగురు కలిసి పట్టుకున్నా.. విడిపించుకుని వెళ్లిపోతున్నాడు. సెల్లో టేప్ తో కట్టేసినా తెంచుకుని దుంకుతున్నాడు.. ఇక ఏం చేయలేక ఫ్లైట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేసి.. అతడ్ని దించేసి.. టేకాఫ్ చేశారు.

33 వేల అడుగుల ఎత్తులో..

రష్యా రాజధాని మాస్కో నుంచి థాయ్ లోని ఫుకెట్ రాష్ట్రానికి బయలుదేరిన నార్విండ్ ఫ్లైట్ లో జరిగిన ఈ సంఘటనను దానిలో ప్రయాణిస్తున్న ఓ విదేశీ రిపోర్టర్ తన ఫోన్ లో రికార్డ్ చేసింది. విమానం నడి ఆకాశంలో 33 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. సడన్ గా ప్రయాణికుల సీటు బెల్ట్ గాల్లోకి లేస్తోంది. వెంటనే సీటు బెల్ట్ గట్టిగా పెట్టుకోండి అంటూ అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రయాణం మధ్యలో ఇదేంటా అని షాక్ అయ్యారు ప్రయాణికులు. అప్పుడే ఫ్లైట్ పైలట్ మరో హెచ్చరిక చేశాడు.

విమానం చివరిలో ఓ తాగుబోతు.. ఎమర్జెన్సీ డోర్ తెరుస్తున్నాడు అని చెప్పాడు. అంతే వెంటనే ఆరేడుగురు కలిసి అతడిని కూర్చోబెట్టారు. అప్పుడే కొద్దిగా ఓపెన్ అవుతున్న డోర్ ని సిబ్బంది లాక్ చేశారు. అతడిని ఆపడానికి ఎంత మంది ప్రయత్నించినా వినలేదు. ఓ డాక్టర్ వచ్చి కూల్ గా చెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. మళ్లీ లేచి అక్కడికే వెళ్తున్నాడు. సెల్లో టేప్ తో కట్టినా విడిపించుకుంటున్నాడు. ఇక ఈ తిప్పలు పడలేక ఫ్లైట్ ఉజ్బెకిస్థాన్ లోని తాస్కెంట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అక్కడ ఉజ్బెకిస్థాన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానం టేకాఫ్ అయింది.

మళ్లీ మధ్యలో ల్యాండింగ్

అక్కడితో ఆ తిప్పలు ముగిసిపోలేదు. మరికొంత సమయం ప్రయాణం తర్వాత మళ్లీ ఇంకో ఇద్దరు తాగుబోతులు ఇబ్బంది పెట్టారు. వారిని సర్ది చెప్పి కూర్చోబెట్టే లోపు ఓ వ్యక్తి ఫ్లైట్ లోని టాయిలెట్ లో సిగరెట్ తాగుతున్నాడు. వీళ్లనీ భరించలేక మళ్లీ థాయ్ లాండ్ లోని ఓ విమానాశ్రయంలో వారిని దించేశారు. ఇన్ని స్టాస్ ల తర్వాత చివరికి ఫుకెట్ చేరుకుంది విమానం.