తప్పతాగి.. బైక్ ను ఈడ్చుకెళ్లిన లాయర్ కారు

తప్పతాగి.. బైక్ ను ఈడ్చుకెళ్లిన లాయర్ కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండవల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో హైకోర్టు న్యాయవాది  కారుతో ఆగి ఉన్న  బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు. అయితే బైక్ పై ఉన్న  పాప చాక్లెట్ కోసం అప్పుడే షాప్ లోకి వెళ్లడంతో  పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఉండవల్లి సెంటర్లో.. ఘటన జరిగిన సమయంలో జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సీఎం జగన్ నివాసం ఉండే క్యాంప్ కార్యాలయానికి సమీపంలోనే.. తాగిన మత్తులో న్యాయవాది ఫుల్ గా మందు కొట్టి.. ఓ బైక్ను ఈడ్చుకెళ్లడం కలకలం రేపింది. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత నిందితుడికి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేశారు పోలీసులు.
 
నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన న్యాయవాది తప్పతాగి కారు నడపడమేంటని స్థానికులు నిలదీస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజర్లు లేవా అని ప్రశ్నస్తున్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వస్తే.... మత్తు దిగిన తర్వాతే టెస్టులు చేస్తారా అంటూ మండిపడుతున్నారు.  వివిఐపి జోన్లో ఇంత నిర్లక్ష్యమా..? అని నిలదీస్తున్నారు.