మద్యం మత్తులో రోడ్డుపై యువకుడి హల్చల్

మద్యం మత్తులో రోడ్డుపై యువకుడి హల్చల్

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ యువకుడు మద్యం సేవించి హల్ చల్ చేశాడు. ఏప్రిల్ 11 వ తేదీ మంగళవారం రాత్రి జగిత్యాల కొత్త బస్టాండ్ సర్కిల్ దగ్గర గుర్తు తెలియని యువకుడు ఫుల్ గా మద్యం సేవించి నడవలేని స్థితిలో నడిరోడ్డుపైనే పడుకున్నాడు. దీంతో రోడ్డుపై వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కొందరు యువకులు గమనించిన ఆ మందుబాబును రోడ్డు పక్కకు తీసుకెళ్ళి ముఖంపై నీళ్లు పోసి లేపారు.

కొద్దిసేపటికి ఆ మందుబాబు అతి కష్టం మీద లేచి.. మత్తులో తూళుతూ రోడ్డుపై వచ్చే వాహనాలను అడ్డుకుంటూ నానా రచ్చ చేశారు. అక్కడున్న స్థానికులు ఎంత చెప్పినా వినకపోవడంతో.. చేసేది లేక అతడిని సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు తరలించి వదిలేశారు.