ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కడెం,వెలుగు: జిల్లాలో అతి పెద్దదైన కడెం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద చేరుతోంది. ఆదివారం 12,839 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తి 17,032 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697. 325 అడుగుల నీటిమట్టం ఉంది.  గత మూడు, నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు అలర్ట్​గా ఉంటూ ప్రాజెక్టు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కడెం ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత

శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి

నిర్మల్, వెలుగు:  నిర్మల్  జిల్లా  కేంద్రంలో  ఈనెల 9న జరగనున్న గణేష్  నిమజ్జన శోభాయాత్ర ను  ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మున్సిపల్  చైర్మన్ జి. ఈశ్వర్, నిర్మల్  డీఎస్పీ  ఎల్.జీవన్ రెడ్డి  అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని  దేవరకోట శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో గణేశ్​ఉత్సవ సమితి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేశ్​ నిమజ్జన శోభాయాత్ర  సందర్భంగా  ప్రతి ఒక్కరూ  పోలీసు  సిబ్బందికి సహకరించాలని సూచించారు.  ఇటీవల  కురిసిన భారీ  వర్షాల వల్ల వినాయక సాగర్  చెరువు  పూర్తి స్థాయిలో  నిండిందని, నిమజ్జన  సమయంలో మండప నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  శోభాయాత్ర సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని వసతులు  ఏర్పాటు  చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ తెలిపారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్, నాయకులు ముప్పిడి రవి, పతికే రాజేందర్,  గండ్రత్ రమేశ్, దొనగిరి మురళి, శ్రావణ్ కుమార్, అనిల్, సాయి, హరీశ్ తదితరులు ఉన్నారు.

సీపీఐ రాష్ట్ర మహాసభలకు తరలిన లీడర్లు

న్యాయం చేయాలంటూ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా

కాగ జ్ నగర్,వెలుగు: న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి కౌటల మండలకేంద్రంలోని ఓ సబ్ స్టేషన్​ఎదుట ఆదివారం ధర్నా చేశాడు. వివరాలిలా ఉన్నాయి... కౌటల మండలం తలోడి గ్రామానికి చెందిన దుర్గం పండరి వారం కింద పంచాయతీ వీధి లైట్లు ఫిట్​చేసేందుకు కూలీ పనికి వెళ్లాడు. ఎల్​సీ తీసుకొని కరెంట్​పోల్​ఎక్కి వీధి లైట్లు పెడుతుండగా..  కరెంట్ ​సప్లై కావడంతో షాక్​ కొట్టి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పంచాయతీ సిబ్బంది హాస్పిటల్​కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. తీవ్ర గాయాలపాలైన తనను కరెంట్​అధికారులు ఆదుకోవాలని డిమాండ్​చేస్తూ బాధితుడు కుటుంబంతో కలిసి కౌటల సబ్​స్టేషన్​ఎదుట ధర్నా చేశాడు. తాను ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నానని, ఎలక్ర్టిసిటీ అధికారులు తనను ఆదుకోవాలని డిమాండ్​చేశాడు.  అయితే అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో ఆందోళన విరమించారు. 

మృతి చెందిన వీఆర్ఏలకు నివాళులు 

ఖానాపూర్, వెలుగు:  సమస్యలు పరిష్కరించాలని కొన్ని రోజులుగా సమ్మెలో పాల్గొంటూ మనస్తాపంతో చనిపోయిన 22 మంది వీఆర్ఏలకు ఆదివారం ఖానాపూర్  పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద  ఖానాపూర్  మండల  వీఆర్ఏలు నివాళులర్పించారు. ఈ  సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ  కామారెడ్డి  జిల్లాలో  రాష్ట్ర సర్కార్  నిర్లక్ష్యం వల్లే  అశోక్ అనే  వీఆర్ఏ  గుండెపోటుతో చనిపోయాడని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. 

పోలీస్ ​నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో పోలీసు నియామకాలకు సంబంధించి జరుగుతున్న అర్హత పరీక్షల్లో రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారని,  దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని టీవీయూవీ స్టేట్​సెక్రటరీ చిప్పకుర్తి శ్రీనివాస్​అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మార్కులను తగ్గించి నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో  లీడర్లు శ్రావణ్ రవితేజ, వినోద్,  ప్రసాద్, మల్లేష్, రాజకుమార్ తదితరులు  పాల్గొన్నారు.

ప్రశాంతంగా  సింగరేణి ఎగ్జామ్

మందమర్రి/ఆదిలాబాద్​, వెలుగు: సింగరేణి జూనియర్​అసిస్టెంట్​(ఎక్స్​టర్నల్​) ఎగ్జామ్​ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.  మంచిర్యాల, ఆదిలాబాద్​ జిల్లాలో 39 కేంద్రాల్లో 13,105 మంది ఎగ్జామ్​రాయాల్సి ఉండగా 10,593 మంది హాజరయ్యారు. 2,512 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 80.83శాతం హాజరు నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు, ఆదిలాబాద్​లో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మంచిర్యాల గవర్నమెంట్​ కాలేజీ ఎగ్జామ్​సెంటర్​లో ఇద్దరు అభ్యర్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని ఎగ్జామ్​కు అనుమతించలేదు. పరీక్ష నిర్వాహకులు, పోలీసులను ప్రాధేయపడినప్పటికీ వారిని లోపలికి పంపించలేదు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని ఎగ్జామ్​సెంటర్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్, ఆదిలాబాద్ ప్రిన్సిపల్, రీజనల్ కోఆర్డినేటర్ డా.రాహత్ ఖానమ్ పరిశీలించారు. చీఫ్​ కోఆర్డినేటర్​, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ బృందం ఎగ్జామ్​సెంటర్ల తనిఖీలు చేశారు. మంచిర్యాల జిల్లాలోని పరీక్ష కేంద్రాలను రీజినల్​ కో ఆర్డినేటర్​ చక్రపాణి, చీఫ్​ కోఆర్డినేటర్​, శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి, డీజీఎం పర్సనల్​ గోవిందరాజు తనిఖీ చేశారు.

దొంగల భయంతో గ్రామస్తుల పహారా

నర్సాపూర్ (జి), వెలుగు: నర్సాపూర్(జి) పోలీస్ స్టేషన్ పరిధిలోని బామిని(బి) లో శనివారం రాత్రి దొంగతనం  జరిగింది. గ్రామానికి చెందిన ముత్యం అనే రైతు ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి చేతిపై దాడి చేసి నగదు  దొంగిలించినట్లు ఎస్ఐ గీత తెలిపారు. దొంగల భయంతో ఊళ్లల్లో గ్రామస్తులు పహారా కాస్తున్నారు. వారం రోజుల నుంచి బిహార్​కు చెందిన ముఠా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతోందని పుకార్లు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు రాత్రి సమయాల్లో గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో కూర్చొని కాపలా కాస్తున్నారు.

పాన్ షాపులో చోరీ

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి పట్టణంలోని కాంటాచౌరస్తా వద్దనున్న ఓ పాన్ షాప్ లో దొంగతనం జరిగింది.  బాధితుడు ఎం. సురేశ్​కథనం ప్రకారం.. రోజు వారీగా పాన్ షాప్  ను శనివారం రాత్రి  బంద్ చేసుకొని ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి షాప్ ను తెరిచి చూడగా పైన రేకులు పగులగొట్టి రూ.50 వేల విలువైన సామగ్రి, రూ.5 వేల నగదు దొంగలు ఎత్తుకు పోయినట్లు బాధితుడు తెలిపారు. సురేశ్​ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్  తెలిపారు.

మానవ హక్కులను కాపాడుకోవాలి

నస్పూర్, వెలుగు: మానవ హక్కుల  పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జాతీయ  మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ఐలేని శ్రీనివాసరావు తెలిపారు.  ఆదివారం  నస్పూర్ ప్రెస్‌‌క్లబ్‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను  కాపాడడమే తమ లక్ష్యమన్నారు. ప్రజా సమస్యలను సంబంధిత ఆఫీసర్ల దృష్టికి  తీసుకుపోయి పరిష్కార మార్గాలు చెబుతామని, ప్రజలను చైతన్యపరిచి, సామాజిక న్యాయం కోసం  ముందుకెళ్తామన్నారు.  సమావేశంలో మంచిర్యాల  జిల్లా కొత్త కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా గుగ్గోత్ బాలాజీ, వర్కింగ్  ప్రెసిడెంట్ బొల్లంపల్లి నాగరాజగౌడ్, జనరల్ సెక్రటరీ కొత్తవడ్ల ప్రవీణ్ కుమార్​తోపాటు 16మంది సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎన్ హెచ్ఆర్‌‌సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాస మహేశ్, కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ పెరుమాండ్ల శివకృష్ణ, జగిత్యాల జిల్లా ప్రతినిధి  కొక్కుల ప్రభాకర్ పాల్గొన్నారు.

జెండా గద్దె కూల్చివేతపై ఫిర్యాదు

మంచిర్యాల, వెలుగు: హాజీపూర్​ మండలం నర్సింగాపూర్​లో బీజేపీ జెండా గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి కూల్చివేశారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి తెలిపారు. అలాగే రాపల్లి వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ ఫ్లెక్సీని తొలగించారన్నారు. దీనిపై ఎంక్వైరీ చేసి ఈ ఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తిరుపతి చెప్పారు. 

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. మంచిర్యాలలోని ఓ ఫంక్షన్​ హాల్​లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్​రెడ్డి, పీఆర్టీయూ రాష్ర్ట అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్​రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్​రావు హాజరై బెస్ట్​ టీచర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొట్టె శంకర్​, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  