
ఢిల్లీ : బస్సులో ఓ మహళ రెచ్చిపోయి డాన్స్ చేసింది. ఆమె ఆడుతుండగా బస్సులోని ప్రయాణికులు చప్పట్లు కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే..పాపం బస్సు డ్రైవర్, కండక్టర్ మాత్రం దీనిపై కఠినచర్యలు ఎదుర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. జూన్ 12న జనక్ పురిలో తీసిన ఈ వీడియో ఆ తర్వాత పలు సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొట్టింది. హర్యానీ సాంగ్ కు చిందులేస్తూ మహిళ ఈ వీడియోలో కనిపించింది.
డ్రైవర్, కండక్టర్, మార్షల్ ఆమెను అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని, డీటీసీ ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంటూ ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు బస్ ను ఢిల్లీలోని హరినగర్ డిపోకు చెందిన వాహనంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి బస్ డ్రైవర్‌ను ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) సస్పెండ్ చేసింది. కండక్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి మార్షల్‌ను తిరిగి సివిల్ డిఫెన్స్ కార్యాలయానికి పంపింది.