
- డీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లో డీటీఎఫ్–15వ వార్షిక కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సోమయ్య, లింగారెడ్డి మాట్లాడారు. బడుల మనుగడకు సెమీ రెసిడెన్షియల్ విధానం అవసరమన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, పాలు అందించాలని కోరారు. బడుల్లోనే హోంవర్క్ చేయించి పిల్లలను ఇండ్లకు పంపాలన్నారు. ‘ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్’ పేరుతో కొత్త స్కూళ్ల ఏర్పాటు సరికాదన్నారు