‘ధమాకా’ నుంచి ‘డు.. డు..’ సాంగ్ రిలీజ్

‘ధమాకా’ నుంచి ‘డు.. డు..’ సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హీరోగా చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌.. అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. తాజాగా ‘ధమాకా’ నుంచి ‘డు.. డు..’ అనే మరో పాట విడుదలైంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. పృథ్వి చంద్ర ఆలపించారు. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ అందించాడు.  'వీడు ఎగబడి తెగబడి కలబడి గెలిచే మాస్.. వాడు మనసును మెదడును పదునుగా విసిరే క్లాస్..' అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ క్యారక్టర్ ఏంటనేది ఈ పాటలో తెలియజెప్పే ప్రయత్నం చేశారు. క్లాస్, మాస్ ఆడియన్స్ ని అలరించే ఈ సాంగ్ లో రవితేజ స్వాగ్ ని మనం చూడొచ్చు. 

త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ–స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఇక ఈ మూవీని డిసెంబర్‌ 23న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.