ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే మందు డోర్ డెలివరీ

ఆన్‌లైన్‌లో ఆర్డరిస్తే మందు డోర్ డెలివరీ

దుబాయ్ : మందుబాబులకు కిక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది దుబాయ్ ప్రభుత్వం. లాక్ డౌన్ కారణంగా సుక్క లేక పరేషాన్ అవుతున్న వారికి ఇంటికే మందు సప్లయ్ చేయనుంది. ఇందుకోసం ఆన్ లైన్ లో లిక్కర్ అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ ఆర్డరిస్తే చాలు డోలివరీ బాయ్స్ ఇంటికే మందు తెస్తారు. దుబాయ్ లోని రెండు ప్రముఖ లిక్కర్ కంపెనీలు డోర్ డెలీవరీ కి అన్ని ఏర్పాట్లు చేశాయి. బీర్, వైన్, స్పిరిట్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. లాక్ డౌన్ కారణంగా లగ్జరీ హోటల్స్, పబ్ లు , బార్లకు ఫేమస్ అయిన ఈ ఏడారి దేశంలో సందడి తగ్గింది. లిక్కర్ వినియోగం పూర్తిగా పడిపోయింది. ఎక్కువ ఆదాయమిచ్చే ప్రధాన సోర్స్ ఎఫెక్ట్ కావటంతో దుబాయ్ ప్రభుత్వానికి దిక్కు తోచటం లేదు. కనీసం ఆన్ లైన్ లో లిక్కర్ అమ్మకాల ద్వారానైనా ఇన్ కం రాబట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ ప్రభుత్వం నిర్ణయంతో మందుబాబులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. “లాక్ డౌన్ కారణంగా లగ్జరీ హోటల్స్, బార్లు తీవ్రంగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. లిక్కర్ వినియోగం యూఏఈ లో పెద్ద ఎత్తున తగ్గింది. ఇది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమే” అని యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అనలిస్ట్ రబియా యాస్మిన్ తెలిపారు.