భారత జాతీయ గీతాన్ని పలికించిన దుబాయ్ పోలీసు బ్యాండ్

భారత జాతీయ గీతాన్ని పలికించిన దుబాయ్ పోలీసు బ్యాండ్

ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంసృతి సంప్రదాయాలకు ఎంతో గుర్తింపు  ఉంది. చాలా దేశాలతో భారత్ కు సత్సంబంధాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా అన్ని దేశాల్లో భారతీయులు అనేక రంగాల్లో ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తూ తమ సేవలందిస్తున్నారు. దుబాయ్ లోనూ చాలా మంది ఇండియన్లు ఉన్నారు. అయితే అక్కడ దీపావళి పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది ఆ దేశం.

ఈ ఏడాది కూడా దుబాయ్ లో దీపావళి సంబరాలు మొదలయ్యాయి. హాతీస్ గార్డెన్ లో జరిగిన ఈ వేడుకల్లో దుబాయ్ పోలీసు బ్యాండ్ భారత జాతీయ గీతం జనగణమనను పలికించి… వేడుకలకు హాజరైన వారిని ఆకట్టుకుంది. భారత రాయబార కార్యాలయం సహకారంతో దుబాయ్ టూరిజం విభాగం ఈ కార్యక్రమం నిర్వహించింది.