హైదరాబాద్లో దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్‌‌‌‌పో షురూ

హైదరాబాద్లో దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్‌‌‌‌పో షురూ

హైదరాబాద్, వెలుగు: దుబాయ్‌‌‌‌లో ఆస్తులు కొనే వారి కోసం  ఏఎక్స్ ప్రీమియం ప్రాపర్టీస్ సంస్థ, డామాక్ డెవలపర్‌‌‌‌తో కలిసి దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్‌‌‌‌పోను హైదరాబాద్‌‌‌‌లో శనివారం (అక్టోబర్ 25) ప్రారంభించింది. ఇది ఆదివారం కూడా కొనసాగుతుంది. భారతీయ పెట్టుబడిదారులకు దుబాయ్‌‌‌‌లో పన్ను లేని, ఎక్కువ లాభాలు (10 శాతం వరకు రాబడి) ఇచ్చే, గోల్డెన్ వీసా ఉన్న ఆస్తులను పరిచయం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

 వీసా కోసం రూ.1.5 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. భారతదేశంలో కంటే దుబాయ్‌‌‌‌లో తక్కువ బ్యాంక్ వడ్డీ రేట్లు  ఉంటాయి. కాగా,  భారతీయులు విదేశాల్లో చేసే ఆస్తి పెట్టుబడిలో 60 శాతం కంటే ఎక్కువ దుబాయ్‌‌‌‌లోనే ఉంది.  మన వారికి దుబాయ్ చాలా సురక్షితమైన మార్కెట్ అని ఏఎక్స్ ప్రీమియం తెలిపింది.