దుబాయ్ మునిగిపోయింది.. వీధుల్లో నదుల్లా నీళ్లు

దుబాయ్ మునిగిపోయింది.. వీధుల్లో నదుల్లా నీళ్లు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని కొన్ని ప్రాంతాల్లో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దుబాయ్ వీధులు జలమయమయ్యాయి. భారీ వర్షాలతోUAE  జాతీయ వాతావరణ కేంద్రం ఎల్లో, ఆరెంజ్  అలెర్ట్ జారీ చేసింది. బీచ్ లకు వెళ్లొద్దని హెచ్చరించింది. భద్రత దృష్ట్యా ఇండ్లలోను ఉండాలని సూచిచింది.

దుబాయ్ లో భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఎమిరేట్స్ లో రోడ్డు, వైమానిక రవాణాకు అంతరాయం ఏర్పడింది.. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతుండటంతో రోడ్డు మార్గంలో వాహనాలతో పాటు విమానాలు పూర్తిగా నిలిచి పోయాయి. 

 భారీ వర్షాలకు దుబాయ్ లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు ఎలా దిగ్బంధనం చేశాయో చూపిస్తూ అక్కడి  స్థానికులు సోషల్ మీడియాలో దృశ్యాలను పోస్ట్ చేరశారు. మరోవైపు భారీ వర్షాలతో ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. నీటి సరఫరా, డ్రైనేజీ క్లియరెన్స్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసింది.