Harish vs Raghunandan : దుబ్బాకలో కొత్త బస్టాండ్ రాజకీయం

Harish vs Raghunandan : దుబ్బాకలో కొత్త బస్టాండ్ రాజకీయం

సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్ లో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. దుబ్బాకలో కొత్తగా కట్టిన బస్టాండ్ ను ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నలుగురు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. జిల్లా మంత్రి హరీష్ రావుతో పాటు ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్, మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ హాజరుకానున్నారు. అయితే.. బస్టాండ్ నిర్మాణం క్రెడిట్ తమదంటే తమదని బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. బై పోల్ ఎన్నికల టైంలో దుబ్బాక పాత బస్టాండ్ చుట్టే రాజకీయాలు నడిచిన విషయం తెలిసిందే. 

అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేస్తే... ఏడేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో దుబ్బాక బస్టాండ్ చూస్తే తెలుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు చేశారు. బై పోల్ ఎన్నికల ప్రచారంలో తామే బస్టాండ్ కట్టిస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక తమ ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇంత త్వరగా బస్టాండ్ కట్టించిందని బీజేపీ నేతలు అంటున్నారు. బస్టాండ్ క్రెడిట్ తమదంటే తమదని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ప్రారంభోత్సవానికి రెండు పార్టీల నేతలు హాజరు అవుతుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఆవరణలోకి పబ్లిక్ ను, కార్యకర్తలను అనమతించడం లేదు.