కేసీఆర్ బార్కు ఇచ్చిన విలువ బడికి ఇయ్యడు

కేసీఆర్ బార్కు ఇచ్చిన విలువ బడికి ఇయ్యడు

మెదక్ జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయానికి 24  గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాలు విసిరారు. మంగళవారం కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాల లబ్దిదారుల సమ్మేళనంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల సొమ్మును సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. పనికిరాని ప్రాజెక్టులు కట్టి ప్రజా ధనాన్నివృధా చేశారని విమర్శించారు. రైతు బంధు పేరిట డబ్బులు పంచి పెడుతున్నారని, వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతు బంధు అవసరమా అని ప్రశ్నించాడు. పీఎం సమ్మాన్ నిధి కింద నిజమైన రైతులకు మోడీ పెట్టుబడి సాయం చేస్తున్నారని చెప్పారు. 
 

రైతు పక్షపాతినంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి ఆయన రైతులకు చేసిందేమీ లేదన్నారు. నిత్యం ఫాం హౌజ్ లో ఉంటూ... పరిపాలనను గాలికొదిలేశారని ఫైరయ్యారు. బార్ కు ఇచ్చిన విలువ కేసీఆర్ బడికి ఇవ్వరని విమర్శించారు. మంత్రి హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు.