
‘భోళాశంకర్’ సినిమాకు సంబంధించి డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘సినిమా తెరకెక్కిన తీరు చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రిలీజ్ డేట్ లాక్ చేసుకోండి. సినిమా థియేటర్లో కలుద్దాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.