
ఆగ్నేయ అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడటంతో మధ్య కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40కి,మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో అక్కడక్కడా చేపల వేట,రాత్రి ప్రయాణాలను కేరళలో బ్యాన్ చేశారు. శుక్రవారం రాత్రి అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులంలో వర్షాలు కురిశాయి. పతనంతిట్ట, ఇడుక్కి, త్రిసూర్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది. కేరళ తీరం వెంట బలమైన గాలులు వీస్తాయి.
ఈక్రమంలో మే 31 నుంచి జూన్ 1వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయి. కోజికోడ్, ఇడుక్కి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇడుక్కిలో రాత్రి ప్రయాణాలు నిషేధించారు. దక్షిణ తీరం లక్షద్వీప్ ల వెంట చేపల వేట నిషేధించారు. సముద్రంలో 0.5 నుంచి 2.3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడతాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రకటించింది.