సింగరేణికి రావాల్సిన బిల్లులు రూ.15,500 కోట్లు

సింగరేణికి రావాల్సిన బిల్లులు రూ.15,500 కోట్లు

వినియోగదారుల నుంచి సింగరేణికి రూ.15,500 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని మేనేజ్ మెంట్ పేర్కొంది. సింగరేణి అప్పులపాలవుతోందన్న వార్తల నేపథ్యంలో సంస్థ ప్రకటన రిలీజ్​ చేసింది.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వినియోగదారుల నుం చి సింగరేణికి రూ.15,500 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని మేనేజ్ మెంట్ పేర్కొంది. సింగరేణి అప్పులపాలవుతోందన్న వార్తల నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై బుధవారం ప్రకటన విడుదల చేసిం ది. రూ.32 వేల కోట్ల టర్నోవర్​తో సంస్థ ఆర్థికంగా బలంగా ఉందని అందులో పేర్కొంది. ‘‘సింగరేణికి పలు బ్యాంకులతో పాటు ఎల్ఐసీలో ఉన్న డిపాజిట్లు, బాండ్ల విలువ రూ.11,665 కోట్ల దాకా ఉంటుంది. వీటి ద్వారా ఏటా రూ.750 కోట్ల మేర వడ్డీ వస్తోంది. సోలార్ ​విద్యుత్​కేంద్రాల కోసం రూ.472 కోట్ల మేర అప్పు చేయగా తీర్చేశాం. థర్మల్ విద్యుత్​ కేంద్రం కోసం చేసిన రూ.5,300 కోట్ల అప్పులో ఇంకా రూ. 2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. సింగరేణికి ప్రస్తుతం రూ.2,800 కోట్ల అప్పు ఉంది” అని తెలిపింది. ‘‘తెలంగాణ రాక ముందు సగటున ఒక్కో కార్మికుడిపై సంక్షేమం కోసం రూ.1.15 లక్షలు  వెచ్చించగా.. ప్రస్తుతం రూ.3.15 లక్షలు వెచ్చిస్తున్నం. ఎనిమిదేండ్లలో సింగరేణి లాభాలు 500 శాతం పెరిగి రూ.459 కోట్ల నుంచి రూ.2,300 కోట్లకు చేరాయి”అని చెప్పింది.