ఆహాలో దుల్కర్ సల్మాన్ ఒక యముడి ప్రేమకథ

ఆహాలో దుల్కర్ సల్మాన్ ఒక యముడి ప్రేమకథ

సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో తెలుగులోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు మలయాళ స్టార్ హీరో  దుల్కర్ సల్మాన్.  తాజాగా  ఆయన నటించిన  మలయాళ బ్లాక్‌‌‌‌బస్టర్‌‌‌‌ మూవీ ‘ఒరు యమండన్ ప్రేమకథ’ చిత్రం   తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ‘ఒక యముడి ప్రేమకథ’  పేరుతో గురువారం నుంచి ఈ మూవీ  ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 

కామెడీ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా రూపొందిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం మలయాళంలో విడుదలై హిట్ టాక్‌‌‌‌ను తెచ్చుకుంది. ఇందులో దుల్కర్‌‌‌‌‌‌‌‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. మరోవైపు దుల్కర్ ప్రస్తుతం ఆకాశంలో ఒక తార, కాంతా అనే రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు.