
‘పఠాన్’ లాంటి సూపర్ హిట్ తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తోన్న చిత్రం ‘డంకీ’. హ్యూమర్‌ను, హ్యూమన్ ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కిస్తాడనే పేరున్న రాజ్ కుమార్ హిరాణీ దీనికి దర్శకుడు. హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ మూవీ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇంగ్లీష్ నేర్చుకొని ఎలాగైనా యూకే వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే గ్రామీణ యువకుడి పాత్రలో షారుఖ్ నటన ఆకట్టుకుంది. తనకు జంటగా తాప్సీ కనిపించింది. విక్కీ కౌశల్ కీలకపాత్ర పోషించాడు. కథలోకి వెళ్తే... ఇంగ్లీష్ రాకపోవడంతో ఐదుగురు ఫ్రెండ్స్ వీసాలు రిజెక్ట్ అవుతాయి.
దీంతో అక్రమంగా యూకే వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయాణంలో వీళ్లంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది మెయిన్ కాన్సెప్ట్. మూడు నిమిషాల ట్రైలర్‌లో కథ ఏమిటో క్లియర్‌గా రివీల్ చేశారు. ‘డంకీ’ అంటే మరో దేశంలోకి అక్రమంగా చొరబడటం అని అర్థం. సరదా సీన్స్‌తో మొదలైన ట్రైలర్, ఆ తర్వాత ఎమోషనల్‌గా టర్న్ అయ్యింది. ‘బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చినప్పుడు మనం హిందీ వచ్చా అని ఆపలేదు.
కానీ మనల్ని ఆపడానికి వాళ్లకు ఎంత ధైర్యం’ అంటూ షారుఖ్ ప్రశ్నించే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. మొత్తంగా ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్ కలగలిసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. డిసెంబర్ 21న సినిమా విడుదల కానుంది.