దర్బార్ సినిమా రిలీజ్ : ఉద్యోగులకు సెలవు

V6 Velugu Posted on Jan 09, 2020

తమిళనాడు : ప్రపంచ వ్యాప్తంగా దర్బార్ సినిమా సందడి నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా విడుదల కావడంతో థియేటర్ల దగ్గర ఆయన అభిమానులు హంగామా చేస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో  ప్రీమియర్ షో  చూసేందుకు ప్ర్రేక్షకులు భారీగా వచ్చారు. చెన్నై, ముంబైలో క్రాకర్స్ కాల్చుతూ,  డ్రమ్ములు వాయిస్తూ స్టెప్పులు వేశారు. సినిమా సక్సెక్ కావలంటూ మహిళలు పూజలు చేశారు.

సినిమా థియేటర్లు, మాల్స్ దగ్గర రజనీకాంత్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన అభిమానులు.. వాటికి పాలాభిషేకం చేస్తున్నారు. భారీ బ్యానర్లు, ఫ్లైక్సీలు కట్టి.. సూపర్ స్టార్ పై  తమ అభిమానం చాటుకున్నారు. కొరియోగ్రాఫర్ లారెన్స్  ప్రేకక్షలుతో  కలిసి సినిమా చూశారు. చెన్నైలోని ఓ కంపెనీ దర్బార్ సినిమా రిలీజ్ సందర్భంగా తమ ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేలకు పైగా ధియేటర్లలో దర్బార్ సినిమా నడుస్తోంది.

Tagged cinema, kollywood, Rajanikanth, darbar, Nayanatara

Latest Videos

Subscribe Now

More News