ఆదిలాబాద్జిల్లా నేరడిగొండలో ఘనంగా దుర్గమ్మ బోనాలు

ఆదిలాబాద్జిల్లా నేరడిగొండలో ఘనంగా దుర్గమ్మ బోనాలు

నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్​జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆదివారం బోనాలను వైభవంగా నిర్వహించారు. 

మహిళలు మంగళ హారతుల మధ్య బోనాలు నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.