పాపం మందు బాబు… ఆరు సార్లు ఓటీపీ చెప్పి

పాపం మందు బాబు… ఆరు సార్లు ఓటీపీ చెప్పి

కరోనా వైరస్ కారణంగా వరల్డ్ వైడ్ గా లాక్ డౌన్ విధించారు. భారత్ లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో రవాణ సౌకర్యాలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులకు తప్ప..మరేవాటికి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఈ కారణంగా షాపింగ్ మాల్స్ తో పాటు వైన్ షాపులు మూతపడ్డాయి.ఈ ఎఫెక్ట్ మందు బాబులపై పడింది. లిక్కర్ కిక్కు లేక కొంత మంది అవస్థలు పడుతున్నారు. మద్యం షాపులు మూసివేయడంతో ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఇదే అదునుగా.. సైబర్‌ క్రైమ్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. లిక్కర్ సరఫరా చేస్తామని నమ్మిస్తూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆన్‌ లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసి లక్ష రూపాయలు పొగొట్టుకుంది ఓ జంట. ఈ ఘటన ముంబైలో జరిగింది.

వైన్ షాపులు మూతపడటంతో ముంబైలోని చెంబూర్‌కు చెందిన ఓ దంపతులు మార్చి 24వ తేదీన ఆన్‌లైన్‌లో లిక్కర్ కొనుగోలు చేయాలనుకున్నారు. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసి ఓ ఫోన్‌ నెంబర్‌ను తెలుసుకున్నారు. ఆ నెంబర్ కు కాల్ చేయగా.. ఆన్‌లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని ఓ వ్యక్తి ఫోన్ లో తెలిపాడు. దీని కోసం ఓటీపీ వస్తుందని… అది చెప్పాల్సిందిగా కోరాడు. ఆ వ‍్యక్తి మాటలను నమ్మిన దంపతులు.. ఓటీపీని వారికి చెప్పారు. దీంతో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆ మొత్తం పొరపాటున కట్ అయ్యాయని.. వెంటనే వాపసు చేస్తామని…అందుకు ఇప్పుడు వచ్చే మరో ఓటీపీని చెప్పాలన్నాడు. అలా దాదాపు ఆరుసార్లు చెప్పిన ఓటీపీ తో రూ. 1.03 లక్షలు కొట్టేశారు. ఆ తర్వాత బాధితుడు కాల్ చేయగా తమకు డబ్బు జమ కాలేదని లిక్కర్ ను డెలివరీ చేయలేమని.. మరొక కార్డు ఉపయోగించి చెల్లింపులు జరపాలని తెలిపాడు. చివరకు మోస పోయామని తెలుసుకున్న ఆ దంపతులు తిలక్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల పిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.