పాలమూరులో గ్రాండ్​గా దసరా సెలబ్రేషన్స్

పాలమూరులో గ్రాండ్​గా దసరా సెలబ్రేషన్స్

దసరా పండుగను ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు గ్రాండ్​గా జరుపుకున్నారు. తొమ్మిది రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం విజయదశమి సందర్భంగా సాయంత్రం ఆలయాల్లో శమీ పూజలు నిర్వహించి, ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమం జరిగింది.

మహబూబ్​నగర్​లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ధ్వజాధారి రథోత్సవం ఆర్య సమాజ్  భవనం నుంచి ప్రారంభమై మినీ ట్యాంక్ బండ్​ వద్దకు చేరుకుంది. అనంతరం అక్కడ నిర్వహించిన రావణ దహన ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు తరలి వచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ పూజల్లో పాల్గొన్నారు. వనపర్తిలో జరిగిన వేడుకల్లో మంత్రి నిరంజన్​రెడ్డి పాల్గొని శమీ పూజ నిర్వహించారు.

- వెలుగు, నెట్​వర్క్