దసరా మోత.. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీలు

దసరా మోత.. స్పెషల్ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీలు

దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 4035 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఎంజీబీఎస్,సీబీఎస్, జేబీఎస్, దిల్‎సుఖ్‎నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‎బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్‎తో పాటు సిటీలోని పలు ఇతర పాయింట్ల నుంచి స్పెషల్ బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నామని.. రద్దీని దృష్టిలో పెట్టుకొని 11వ తేదీ నుంచి సర్వీసులను పెంచుతామని ఆర్టీసీ తెలిపింది. కాగా.. 450 స్పెషల్ బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఉందని తెలిపారు అధికారులు. అయితే ఈ స్పెషల్ బస్సులకు 50 శాతం ఎక్స్ ట్రా చార్జీలు వర్తిస్తాయని ఆర్టీసీ అధికారులు స్పష్టంచేశారు. ఈ స్పెషల్ బస్సుల్లో 950 సర్వీసులు ఏపీ, కర్ణాటకలకు కేటాయించగా.. 3085 సర్వీసులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. ప్రైవేట్ బస్సుల దందాకు అయితే అడ్డే లేకుండా పోయింది. ఏకంగా చార్జీలను 100 నుంచి 125 శాతం పెంచాయి. ప్రజల అవసరాన్ని ఆసరగా చేసుకొని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయని ప్రయాణికులు వాపోతున్నారు.

For More News..

‘మా’ను నడపడం మనకు చేతకాదా?

మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

పండుగపూట గ్యాస్ ధరల మంట.. మరో రూ. 15 పెంపు