- రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్..
సిద్దిపేట రూరల్, వెలుగు: వచ్చే వానాకాలంలో సీజన్‌లో ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డీలర్లను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ జిల్లాలోని ఆగ్రోస్, సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ డీలర్లు వ్యాపార లావాదేవీల చేస్తూనే మార్కెట్‌లో వివిధ రకాల విత్తనాలను రైతులకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఆగ్రోస్, సొసైటీలు అమ్మే విత్తనాలతో పాటు తమ సంస్థ అందించిన విత్తనాలను సైతం రైతులకు అమ్మాలన్నారు. విత్తనాలు అమ్మేటప్పుడు రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. అనంతరం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ జారీ చేసిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
